Breaking News
Home / National / వాళ్ళ కోసం ‘విధ్వంసకర ప్రధాన మంత్రి’ సినిమా : మమత బెనర్జీ

వాళ్ళ కోసం ‘విధ్వంసకర ప్రధాన మంత్రి’ సినిమా : మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. బారాసాత్‌లో జాతర పేరుతో గ్రామీణ రంగస్థల నాటక ప్రదర్శనోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా గురించి ప్రస్తావించారు.
‘‘ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. కాంగ్రెస్ నుంచి వేరుపడి నేను వేరే పార్టీ పెట్టాను. తృణమూల్ కాంగ్రెస్‌ను మీ ఆశీస్సులతో పెట్టాను. జరుగుతున్నది నాశనమని, ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై మమత పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మీద ఎన్నికల ముందు నాటకాలు ఆడుతున్నవాళ్ళు మరొక సినిమా చూడాలి. అదే ‘ద డిజాస్ట్రస్ పీఎం’. దానిని కూడా రాబోయే రోజుల్లో చూపించాలి. ఎవరినీ వదలం. మీరు చూపించేది వెనుకకు తిరిగి వస్తుంది’’ అని హెచ్చరించారు.

‘‘ఓసారి అద్దంలో చూసుకో. కనీసం నవ్వలేవు. బాగా మాట్లాడలేవు. అతన్ని చూసినవాళ్ళు, ఓరి బాబోయ్, గబ్బర్ సింగ్ వస్తున్నాడు. అతన్ని జనం చూసి, గబ్బర్ సింగ్ వస్తున్నాడు అంటారు’’ అని మమత ఎగతాళి చేశారు.

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

సెంట్రల్ కోల్‌కతాలోని హింద్ ఐనాక్స్ సినిమాలో ఈ సినిమాను రద్దు చేశారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Check Also

తుంగ నదిలో చేపల మృతి…ప్రజల కలవరం

Share this on WhatsAppనది నీరు తాగకుండా తీరప్రాంత గ్రామాల ప్రజల భయాందోళనలు శివమొగ్గ : కర్ణాటక రాష్ట్రంలోని తుంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *