Breaking News
Home / National / బామ్మకు ముద్దు పెట్టిన దొంగ…

బామ్మకు ముద్దు పెట్టిన దొంగ…

బ్రెజిల్‌: ఓ షాపులో నగదు దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ.. అక్కడున్న ఓ బామ్మకు ముద్దిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆమె వద్ద ఉన్న నగదును కూడా దొంగకు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మీ నగదు నాకొద్దు అని చెబుతూ.. ఆమె నుదిటిపై దొంగ ముద్దు పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. మాస్కులు ధరించి ఆయుధాలతో ఇద్దరు దొంగలు బ్రెజిల్‌లోని ఓ ఫార్మసీ దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న నగదును దోచుకున్నారు. అయితే ఆ సమయంలో మెడిసిన్స్‌ కొనేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. ఆమె కూడా భయపడి తన వద్ద ఉన్న నగదును దొంగకు ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో దొంగ స్పందిస్తూ.. మీ నగదు నాకొద్దు అని చెప్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మొత్తానికి షాపులో ఉన్న వెయ్యి డాలర్లతో పాటు విలువైన వస్తువులను దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *