Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధమైంది

తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధమైంది

తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధమైంది. 80 రోజుల అనంతరం భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలగనుంది. సోమవారం దాదాపు 6 వేల మంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ దర్శన్ ప్రారంభించనున్నారు. మంగళవారం, బుధవారం కూడా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో అధికారులు ట్రయల్స్‌ నిర్వహిస్తారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఏడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి గంటకు 500 మంది భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శన సమయ వేళలు కూడా టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నట్టు వెల్లడించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *