Breaking News
Home / Film News / తనని ప్రభావితం చేసిన సినిమా ఇదేనట..!

తనని ప్రభావితం చేసిన సినిమా ఇదేనట..!

హైదరాబాద్‌: ఇటీవల టాలీవుడ్‌ అర్జున్‌రెడ్డి విజయ్‌ దేవరకొండ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఏది? అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ”గల్లీబాయ్‌’. ఆ సినిమా చూసిన వెంటనే నేను బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను అభినందించాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో నేను ఆలియా నంబర్‌ కోసం ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహర్‌కి మెసేజ్‌ చేశాను. ఆ సినిమా చూశాక నాకు నిద్రరాలేదు.’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.

ఈ ఏడాదిలో విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. దీనితోపాటు విజయ్‌ దేవరకొండ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించే సినిమాలో నటించనున్నారు. మరోవైపు ‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకి విజయ్‌దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *