Breaking News
Home / States / ఆమెలోని సామాజిక బాధ్యతకు అరుదైన గుర్తింపు…

ఆమెలోని సామాజిక బాధ్యతకు అరుదైన గుర్తింపు…

హైదరాబాద్‌: టాలీవుడ్ కథానాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఈ గాంధీ జయంతి తమ కుటుంబానికి ఎంతో ప్రోత్సాహన్నిచ్చిందని అంటున్నారు. ఓ వైపు అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛెర్‌ పర్సన్‌గా, మరోవైపు కొణిదెల ఇంటి కోడలిగా ఆమె ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆమెలోని సామాజిక బాధ్యతను గుర్తించి ఓ ప్రైవేటు సంస్థ వారు ఆమెకు మహాత్మా గాంధీ అవార్డును అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ‘మనల్ని మనం కనుగొనడానికి ఉత్తమమైన మార్గం ఎదుటివారికి సాయం చేయడం అని మహాత్మా గాంధీ తెలిపారు. నాలోని సామాజిక బాధ్యతను గుర్తించి మహాత్మా గాంధీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గాంధీజయంతి మా కుటుంబానికి చాలా విలువైనది. మాకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చింది. ‘సైరా నరసింహారెడ్డి’ మీద మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు.’ అని ఉపాసన తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *