Breaking News
Home / National / ఈ కిరాతక చర్య మనందరికీ సిగ్గుచేటు: నటి

ఈ కిరాతక చర్య మనందరికీ సిగ్గుచేటు: నటి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్‌లో గురువారం ఓ ఆరెస్సెస్ కార్యకర్తతో పాటు గర్భవతి అయిన భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి సంబంధించిన ఓ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సోషల్ మీడియలో పోస్టు చేయడంతో ఈ హత్యలు రాజకీయ మలుపు తీసుకున్నాయి.

తాజాగా ఈ ఘటనపై ప్రముఖ బెంగాలీ నటి, డైరెక్టర్ అపర్ణా సేన్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ‘‘ఆరెస్సెస్ కార్యకర్త కుమారుడు, గర్భిణి అయిన భార్య, మన సొంత పశ్చిమ బెంగాల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కిరాతక చర్యకు కారణం ఏమైనా కావచ్చు ఇది మనందరికీ సిగ్గుచేటు’’ అని ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘సీఎం మేడమ్ ఈ దారుణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించండి. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోండి. పశ్చిమ బెంగాల్లోని పౌరులందరి బాధ్యత మీదే. మీరు అందరికీ ముఖ్యమంత్రి..’’ అని పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *