Breaking News
Home / States / దిశకు ఇదే నిజమైన నివాళి….

దిశకు ఇదే నిజమైన నివాళి….

హైదరాబాద్ : ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా పరిగణించి వారిపై దారుణ ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ ఎన్‌కౌంటర్ ఓ గుణపాఠం కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. ఇదే `దిశ`కు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సత్వర న్యాయం అందించిన సీపీ సజ్జనార్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలియజేశారు.

దిశ ఘటన నిందితులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం అని భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపు కోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు` అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *