Breaking News
Home / Film News / ఖురానా కెరీర్‌లోనే ఇది భారీ కలెక్షన్ల చిత్రం….

ఖురానా కెరీర్‌లోనే ఇది భారీ కలెక్షన్ల చిత్రం….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 13న విడుదలైన డ్రీమ్ గర్ల్ మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ నెల రోజుల్లో రూ.140 కోట్లు వసూలు చేసి ఆయుష్మాన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది ఆయుష్మాన్ నటించిన ‘బఢాయి హో’ చిత్రం రూ.138 కోట్లు వసూలు చేయగా, తాజాగా ఈ కలెక్షన్లను ‘డ్రీమ్ గర్ల్’ సినిమా కేవలం నెల వ్యవధిలోనే అధిగమించింది. రాజ్ శాండిల్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నుష్రత్ బరూచా ఆయుష్మాన్ కు జోడీగా నటించగా అన్నూ కపూర్ కీలకపాత్రలో కనిపించాడు.

 

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *