Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుక : పవన్

ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుక : పవన్

అమరావతి: ఏ కొత్త ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారని, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు చేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేస్తోందంటే.. ఇళ్ల కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాల రద్దు, భవననిర్మాణ కార్మికులకు పని లేకుండా చేయడం, ఆశ వర్కర్లని రోడ్లు మీదకి తీసుకురావటం, కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం…మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుందని పవన్ సోషల్ మీడియా వేదికగా విమర్శిలు గుప్పించారు.

ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయని, విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుందని పవన్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారని, ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. గ్రామాల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకటేనని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? అని పవన్ ఎద్దేవా చేశారు.

2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగిన విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఈసారి ఎందుకు విఫలమైందని పవన్ ప్రశ్నించారు. సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారన్నారు. ఏపీ జెన్‌కో, థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్లని, ఈ నెల 29వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పవన్ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *