Breaking News
Home / National / ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడిని వేటాడిన జాగిలం ఇదే…!

ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడిని వేటాడిన జాగిలం ఇదే…!

అమెరికా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబూ బాకర్ అల్ బగ్దాదీని అమెరికా డెల్టా ఫోర్స్ దళాలు ఖతం చేసిన విషయం తెలిసిందే. సిరియాలోని ఓ టన్నెల్‌లో దాక్కున్న బగ్దాదీని వెంటాడి చంపేశారు. అయితే ఆ ఉగ్రవాదిని వేటాడిన జాగిలం ఫోటోను డోనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఓ చూడముచ్చటైన జాగిలం ఫోటోను రిలీజ్ చేశామని, అబూ బాకర్‌ను పట్టుకుని చంపడంలో ఈ జాగిలం కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఆ జాగిలం పేరును మాత్రం వెల్లడించలేదు. శనివారం జరిగిన ఆపరేషన్‌లో ఆ జాగిలం స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. టన్నెల్‌లో బగ్దాదీని ఆ శునకం వెంటాడినట్లు, బగ్దాదీని చంపిన విషయాన్ని మీడియాతో చెబుతున్న సమయంలో ట్రంప్ ఈ జాగిలాన్ని విశేషంగా కొనియాడారు. ఆ తర్వాత ఓ ట్వీట్‌లో ఆ జాగిలం ఫోటోను పోస్టు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *