Breaking News
Home / Film News / సంచలన దర్శకుడి తర్వాతి చిత్రం ఇదేనట…!

సంచలన దర్శకుడి తర్వాతి చిత్రం ఇదేనట…!

ఫిల్మ్ న్యూస్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వర్మ రీసెంట్‌గా తన ట్విట్టర్‌లో నా తదుపరి చిత్రం మెగా ఫ్యామిలీ అనే పేరుతో రూపొందనుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు నేడు వెల్లడిస్తానని నిన్న సాయంత్రం ట్వీట్ చేశాడు. చిత్రానికి మెగా ఫ్యామిలీ అనే పేరు పెట్టేసరికి అందరు ఒక్కసారిగా అటెన్షన్ అయ్యారు. మెగా ఫ్యామిలీపై సినిమా చేస్తాడా అని భావించారు. కాని కొద్ది సేపటి క్రితం సినిమా చేయడం లేదని చెప్పి షాకిచ్చాడు. అందుకు కారణం చిత్రంలో ప్రధాన పాత్రధారికి 39 మంది పిల్లలు ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు ఉండడం, పిల్లల సినిమా తీయడంలో అనుభవం లేని కారణంగా మెగా ఫ్యామిలీ సినిమాని చేయడం లేదని వర్మ పేర్కొన్నాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *