Breaking News
Home / Film News / జాన్‌ మేక్స్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం టైటిల్‌ ఇదే…

జాన్‌ మేక్స్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం టైటిల్‌ ఇదే…

ఫిల్మ్ న్యూస్: ‘మైనా’, ‘సాట్టై’, ‘మోసకుట్టి’, ‘షావుకారుపేట్టై’, ‘బొట్టు’ తదితర చిత్రాలను నిర్మించిన షాలోమ్‌ స్టూడియోస్‌ జాన్‌ మేక్స్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘సంభవం’ అనే టైటిల్‌ పెట్టారు. శ్రీకాంత్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ దినేష్‌ హీరోలుగా నటిస్తున్నారు. పూర్ణ, సృష్టిడాంగే హీరోయిన్లు. ఇంకా ‘బక్రీద్‌’ ఫేమ్‌ బేబి శ్రుతి, కిషోర్‌, నట దర్శకుడు ఎ.వెంకటేష్‌, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్‌, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. నిజాయితీగా, మనసాక్షికి కట్టుబడి జీవించే ఒక వ్యక్తి పరిస్థితుల వల్ల నిజాయితీకి దూరం జరిగినప్పుడు చోటుచేసుకునే సమస్యల ఇతివృత్తంగా ‘సంభవం’ రూపొందుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించినట్టు తెలుస్తోంది. దర్శకుడు ఎ.వెంకటేష్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రంజిత్‌ పారిజాతం కథ, స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు. అమ్రిష్‌ సంగీతం, ముత్తు కె.కుమరన్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ‘సంభవం’ పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *