Breaking News
Home / Film News / ఈసారి ఇంటి సభ్యులందరూ నామినేట్….

ఈసారి ఇంటి సభ్యులందరూ నామినేట్….

సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యులందరూ నామినేట్ అవడం కొంచెం విచిత్రమే అయినా అలా చేయడం కరెక్టే అనే వాదన చాలా మందిలో ఉంది. నామినేషన్ కోసం బిగ్ బాస్ టాపర్స్ ఆఫ్ ద హస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ పర్‌ఫార్మ్ చేయడంలో ఇంటి సభ్యులు తప్పులు చేశారు. తాను గేమ్ ని గేమ్ లానే ఆడతాను అని చెప్పిన వరుణ్ తన భార్య వితికా కోసం ర్యాంకును వదులుకున్నానని చెప్పడం అతని డబుల్ స్టాండర్డ్స్ ని తెలియజేస్తుంది. గేమ్ లో ఎవ్వరైనా ఒక్కటే అన్న వరుణ్ ఇప్పుడు ఇలా చేయడం తన మనస్తత్వాన్ని ప్రశ్నించేదిగా ఉంది. రాహుల్ ఎంతసేపు తాను సేవ్ అవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి రెండో ర్యాంకు కోరుకుంటున్నాడు తప్పితే తనకి అర్హత ఉందని వాదించట్లేదు. ఇక చివరగా బాబా భాస్కర్ శ్రీముఖి చీటి తీసిందన్న కారణంగా ఆమెకు ఫస్ట్ ర్యాంకు ఇచ్చాడు కానీ ఆమె వాదన నచ్చి కాదని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ఈ తప్పులు చేయకుండా ఇంటి సభ్యులు చర్చించుకుని ఉంటే నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా జరిగేది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *