నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఆదివారంతో 15 వారాలు పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో తెలుగు బిగ్బాస్ సీజన్ 3 ముగియనుంది. స్టార్ మా ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హౌస్లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్, అలీ రెజా, శ్రీముఖి, శివజ్యోతి కలిపి ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇప్పటికే బాబా భాస్కర్, రాహుల్ ఫైనల్స్ చేరుకున్నారు. దాంతో శివజ్యోతి, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా మిగిలారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈవారం ఇంటి నుంచి శివజ్యోతి వెళ్లిపోతుందని తెలుస్తుంది. 14 వారాలుగా ప్రేక్షకులతో బాగా కలిసిపోయిన జ్యోతక్క ఇప్పుడు బయటికి వచ్చే టైమ్ వచ్చేసింది. ప్రతి వారం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈవారం శివజ్యోతి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్కా అని చెబుతున్నారు.