Breaking News
Home / Film News / తోలుబొమ్మాలాట మోషన్‌ పోస్టర్‌ విడుదల….

తోలుబొమ్మాలాట మోషన్‌ పోస్టర్‌ విడుదల….

హైదరాబాద్‌: ‘నేను నా పిల్లలకు ఇచ్చిన మాటతో సంతోషంగా ఉన్నానని మనస్ఫూర్తిగా భావిస్తు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని పూర్తి ఆరోగ్యంతో, మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా.’ అని అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌. ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో కుటుంబపెద్దగా రాజేంద్రప్రసాద్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఈ మోషన్‌ పోస్టర్‌లో నటీనటుల మధ్య జరిగిన సంభాషణలు వింటే కుటుంబంలో ఆస్తి తగాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తన కుటుంబసభ్యులకు వీలునామా రాసినట్లు అర్థమవుతోంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *