Breaking News
Home / States / Andhra Pradesh / ప్రకాశం జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తాజాగా మరో 41 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు  1011  కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న పామూరులో 12, చీరాలలో 11, ఒంగోలులో 6 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు  14 కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  87,613 శ్యాంపిళ్లు పంపగా…84,774 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 1879 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 487 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 347 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 667 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *