Breaking News
Home / States / Andhra Pradesh / Chittor / ఫైన్లతోనే వేల రూపాయలు గుంజుతున్నారు…

ఫైన్లతోనే వేల రూపాయలు గుంజుతున్నారు…

తిరుపతి:జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడిని తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్డు కూలీలు, తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్లు కలిశాయి. తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాహనమిత్ర పేరుతో రూ. 10 వేలు ఇచ్చి ఫైన్ల పేరుతో అంతకు మించి లాక్కుంటున్నారని పవన్ కల్యాణ్ దగ్గర తిరుమల తిరుపతి టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ట్యాక్స్ కింద మూడు నెలలకు రూ. 5 వేల 800 చెల్లిస్తున్నాం. అయినా పొల్యూషన్ సెంటర్లు పేరు చెప్పి ట్యాక్సీ డ్రైవర్లను వేధిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్స్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *