Breaking News
Home / National / అతి వేగానికి భారీ మూల్యం…. ఏనుగుల మరణం…

అతి వేగానికి భారీ మూల్యం…. ఏనుగుల మరణం…

కియోంజర్ : ఒడిశా రాష్ట్రం కియోంజర్ జిల్లాలో అటవీప్రాంతంలోని 20వ నంబరు జాతీయ రహదారిపై బాలిజోడి గ్రామం వద్ద ఏనుగులు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ, బస్సులు ఢీకొనడంతో మూడు ఏనుగులు అక్కడికక్కడే మరణించాయి. మరణించే ముందు తీవ్రంగా గాయపడిన ఓ ఏనుగు పెట్టిన అరుపులకు గ్రామస్థులు వచ్చి చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు కారణమైన బస్సును స్వాధీనం చేసుకొని, డ్రైవరును అరెస్టు చేశామని, లారీ డ్రైవరు పారిపోయాడని జిల్లా అటవీశాఖ అధికారి సంతోష్ జోషి చెప్పారు. ఏనుగులు ఇతర వన్యప్రాణులు రోడ్డు దాటకుండా అండర్ పాస్ నిర్మించినా వాటిని వినియోగించుకోక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ఏనుగులు మరణిస్తున్నాయని జోషి చెప్పారు.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *