మంచిర్యాల: జిల్లాలో ముగ్గురు అటవీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఎఫ్‌డీవో ఉత్తర్వులు వెలువరించారు. సెక్షన్ ఆఫీసర్ శేఘరామ్, బీట్ అధికారులు సంతోష్, శ్రీధర్‌లను ఎఫ్‌డీవో విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. మేడరిపేట సెక్షన్లో కలప అక్రమరవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేశారు.
