హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో స్వామి అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడి వివరాలు, హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా బొక్కలగడ్డ బజార్లో ఓ బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మూడు రోజుల క్రితం ప్రేమ్‌సాగర్(13) అనే బాలుడు అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలుడి ఇంటి పక్కన పాత ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పాత ఇంట్లో చూడగా ప్రేమ్‌సాగర్ మృతదేహం లభ్యమైంది. మరొక ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
