Breaking News
Home / Crime / ఈఎస్‌ఐ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌…

ఈఎస్‌ఐ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌…

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గుర్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 16కి చేరింది. తాజాగా తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్‌ లావణ్య, వరంగల్‌ జేడీ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పాషాలను అరెస్ట్‌ చేశారు. మందుల కొనుగోళ్లలో రాజేశ్వర్‌రెడ్డి రూ.28కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో అరెస్టైన వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీ అరవింద్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గుర్ని అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *