Breaking News
Home / Crime / ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

తుమకూరు: చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా గుబ్బి పట్టణ ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులు ఐదుగురు బుధవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లకుండా చెరువులో ఈతకు వెళ్లారు. వారిలో నందన్‌ (13), శ్రీనివాస్‌ (14) లోతుకు వెళ్లి మునిగిపోతూ కేకలు వేయసాగారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మరో విద్యార్థి దర్శన్‌(14)కూడా మునిగిపోయాడు. పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *