వట్టిచెరుకూరు: పిడుగు పాటుకు పది మంది వ్యవసాయ కూలీలు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. పొలంలో కలుపు తీస్తుండగా పిడుగులు పడడంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు పరుగులు తీశారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో పది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
