చెన్నై: తమిళనాడులోని పుదుకొటై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైపూరులో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా పిడుగు పడింది. మృతుల కుటుంబాలు విషాదసాగరంలో మునిగిపోయాయి.
