Breaking News
Home / States / హైదరాబాద్ లో పిడుగుపడి ఇల్లు ధ్వంసం…

హైదరాబాద్ లో పిడుగుపడి ఇల్లు ధ్వంసం…

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ పిడుగుపడి ఓ ఇల్లు ధ్వసమైంది. చాదర్‌ఘట్‌లోని ఓల్డ్ మలక్‌పేట్‌లో రేస్ కోర్టు సమీపంలో ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దానికి ఇంటిలోని వారు పరుగులు తీశారు. పిడుగు దాటికి ఇంటిపై కప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో దిక్కుతోచక ఇంటలో నుంచి పరుగులు తీశామని ఇంటి యజమాని చెబుతున్నారు.

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. గంట పాటు కురిసిన భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్, జంజారాహిల్స్, ఉప్పల్, హబ్సిగూడ, ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులను ముంచేసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *