Breaking News
Home / World News / హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ ఔట్..

హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ ఔట్..

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడిది అందుబాటులో లేకుండా పోయింది. కొత్త జాతీయ చట్టాన్ని చైనా ఆమోదించిన కొన్ని రోజులకే ఈ యాప్‌ మాయం కావడం గమనార్హం. ఆన్‌లైన్ కంటెంట్‌పై ఈ చట్టం పోలీసులకు సర్వాధికారాలు ఇస్తుంది. దీంతో ఈ చట్టంపై ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన టిక్‌టాక్‌ చైనాలో మాత్రం ‘డౌయిన్’ పేరుతో అందుబాటులో ఉంది. చైనా ప్రభుత్వంతో టిక్‌టాక్‌కు ఉన్న సంబంధాల కారణంగా అమెరికా దానిపై ఓ కన్నేసి ఉంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో హాంకాంగ్ నుంచి ఈ యాప్‌ను ఉపసంహరించుకుంటామని చైనా తెలిపింది. 7.4 మిలియన్ ప్రజలున్న హాంకాంగ్‌లో సెప్టెంబరు నాటికే టిక్‌టాక్ 1.8 డౌన్‌లోడ్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు హాంకాంగ్‌లో ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో లేకపోవడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ దీనికి ప్రత్యామ్నాయంగా ‘డౌయిన్’ను ప్రవేశపెడుతుందా? అన్న విషయం తెలియరాలేదు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *