హర్యానా: ఇటీవల కాలంలో వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ వీడియోతో ఫేమస్ అయి యాక్టర్లు అయినవారున్నారు. అయితే తాజాగా టిక్ టాక్ లో ఎంతోమంది ఫాలోవర్లు సంపాదించిన మహిళ ఇపుడు రాజకీయ నాయకురాలు కాబోతుంది. టిక్ టాక్ స్టార్ సోనాలి సింగ్ ఫొగాట్ కు బీజేపీ అదంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. సోనాలీకి టికెట్ కేటాయించినట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు మరింత పెరిగారు.
