Breaking News
Home / States / Andhra Pradesh / పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్….

పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్….

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో అటువైపుగా వెళ్లాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *