Breaking News
Home / National / ల్యాప్‌టాప్ పట్టిన కేరళ బామ్మ.. దగ్గరుండి నేర్పించిన మంత్రి

ల్యాప్‌టాప్ పట్టిన కేరళ బామ్మ.. దగ్గరుండి నేర్పించిన మంత్రి

తిరువనంతపురం: ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో భాగంగా కేరళ సర్కార్ నిర్వహించిన పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించి రికార్డులకెక్కిన కార్తాయని అమ్మ .. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అక్షరాలు దిద్దిన ఆ చేతివేళ్లతోనే.. ల్యాప్ టాప్‌పై కంప్యూటర్ నేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీపావళి సందర్భంగా కేరళ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ సి. రవీంద్రకుమార్.. కార్తాయని అమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి ల్యాప్ టాప్ బహూకరించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు ఆమెకు ఈ బహుమతి అందించారు రవీంద్ర కుమార్.
ఈ సందర్భంగా ల్యాప్ టాప్ ఎలా వినియోగించాలో బామ్మకు వివరించారు. తన ఖాళీ సమయాల్లో ల్యాప్‌టాప్ నేర్చుకుంటానని చెబుతున్నారు బామ్మ. అంతేకాదు పదో తరగతి పూర్తి చేస్తానని.. ల్యాప్ టాప్ కూడా నేర్చుకుని ఉద్యోగం పొందాలన్నదే తన అభిమతమని ఆమె పేర్కొన్నారు. బామ్మ మాటలతో విద్యాశాఖ మంత్రి రవీంద్ర కుమార్ మురిసిపోయారు. 96ఏళ్ల ఈ బామ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలంటూ ప్రశంసించారు.

Check Also

జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్

Share this on WhatsAppతమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *