Breaking News
Home / States / Andhra Pradesh / దేశంలో పారిశ్రామిక విప్లపం తెచ్చేందుకు….

దేశంలో పారిశ్రామిక విప్లపం తెచ్చేందుకు….

కర్నూలు: రాయలసీమలో అక్కడక్కడా అంటరానితనం ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అయితే ఆ అంటరానితనాన్ని రూపుమాపేందుకు బీజేపీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయని.. ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించుటకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి లక్షల కోట్లు నిధులు వస్తున్న సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని టీజీ వెంకటేష్ విమర్శలు గుప్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *