గుంటూరు: యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చేలా ఇక పార్టీ కమిటీలు ఉంటాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రోడ్డు పనుల నుంచి పోలవరం వరకు అన్ని నిలిచిపోయాయని విమర్శించారు. నాలుగు నెలల్లో 17 శాతం ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌పై పొలిట్ బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వసనీయత పోయిందన్నారు. కియా కంపెనీ ప్రారంభానికి సీఎం రాకపోతే ఇక ఎవరు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని ఆయన ప్రశ్నించారు.
