Breaking News
Home / States / ప్రమాదాలను తగ్గించేందుకే…

ప్రమాదాలను తగ్గించేందుకే…

హైదరాబాద్: ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రాచకొండ పోలీసులు విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేకంగా రాడార్ స్పీడ్ డిస్‌ప్లే బోర్డులను కోహేడ, బొంగూలూరు వద్ద ఏర్పాటు చేశారు.

ఈ బోర్డులు వాహనాలు ఎంత స్పీడ్‌లో వెళ్తున్నాయో చూపిస్తాయి. వాహనాలు రెండు, మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నప్పుడే రాడార్ ఆ వాహనాన్ని గుర్తించి వాటి స్పీడ్‌ను ఖచ్చింతంగా అంచనా వేసి బోర్డుపై చూపిస్తుంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై తన వాహనం స్పీడ్‌ను కంట్రోల్ చేసుకునే వీలు కలుగుతుంది. ఒకవేళ ఆ స్పీడ్‌ను కూడా లెక్కచేయకుండా అదే వేగంతో ముందుకు వెళ్తే పోలీసులు లేజర్ స్పీడ్ గన్‌ల సాయంతో చలానాలు విధిస్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *