Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి…

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి…

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్‌ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా అన్ని శాఖల్లో ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపడుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ నియామకాలపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. టీచర్ల పోస్టుల భర్తీకి ఖాళీలు గుర్తించి డీఎస్సీ నిర్వహణకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందన్నారు. డీఎస్సీ–2018కి సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు కూడా ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *