Breaking News
Home / States / పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తున్నారు…

పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తున్నారు…

సూర్యాపేట: తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్‌ ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నారని  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సాకారమయ్యే దశలో వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని కేటీఆర్‌ నుద్దేశించి విమర్శలు చేశారు. 17 ఏళ్లకే సైన్యంలో చేరి శత్రు దేశాలతో పోరాడి వచ్చిన వ్యక్తిని తానని గుర్తుచేశారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిని 30 వేల మెజార్టీతో గెలవకపోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని టీఆర్ఎస్  ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

హుజూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ నేతలు భట్టి, కోమటిరెడ్డి, సీతక్క, పొన్నం, కొండా సురేఖ, శ్రీధర్‌ బాబు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ఎస్సీలకు కేసీఆర్‌ మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఎస్సీలను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *