Breaking News
Home / Film News / నేడు హాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల…

నేడు హాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల…

ఫిల్మ్ న్యూస్: హాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు ప్రత్యేకాదరణ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ‘టర్మినేటర్‌’ సిరీస్ ఒకటి. ఇందులో చివరి పార్ట్ ‘టర్మినేటర్ డార్క్ ఫేట్‌’ సినిమా నవంబర్ 1న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ రోజు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ప్రభాస్ అన్న `టర్మినేటర్‌` లాంటి సినిమాలు చేయాలి. తెలుగులోకి హాలీవుడ్ సినిమాలను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మన `సాహో`, `సైరా`, `వరల్డ్ ఫేమస్ లవర్‌` వంటి చిత్రాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి ” అని అన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *