చైనా : నేడు డ్రాగన్ దేశం చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా బీజింగ్‌లో కలర్‌ఫుల్ గా గ్రాండ్‌గా సైనిక పరేడ్ నిర్వహించింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన చేపట్టారు. కొత్తగా సమకూర్చుకున్న ఆయుధాలను కూడా మిలిటరీ పరేడ్‌లో ప్రదర్శించారు. వేలాది మంది ప్రేక్షకులు పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. తైమన్స్క్వేర్లో సైనికులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రే రంగు మావో జాకెట్ వేసుకున్న దేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ పరేడ్‌ను తిలకించగా మాజీ అధ్యక్షుడు హూ జింటావో, జియాంగ్ జెమిన్‌లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీన జాతీయ దినోత్సవాన్ని చైనా జరుపుకుంటుంది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(పీఆర్సీ) ఏర్పాటు అయ్యింది. 20 హెలికాప్టర్లతో 70 సంఖ్యను వచ్చేలా వినువీధిలో ప్రదర్శన చేపట్టారు.
China holds a grand celebration with a military parade on Oct. 1, the National Day, to mark the founding of the People's Republic of China (PRC) in 1949. The parade begins with formation of 20 helicopters in shape of "70", which symbols the 70th founding anniversary of the PRC. pic.twitter.com/fe7pJ2YqrS
— CCTV (@CCTV) October 1, 2019