హైదరాబాద్: వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న నిర్భందానికి వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నట్లు పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. లక్ష్మణ్, విరసం కార్యవర్గసభ్యులు ప్రొ. కాశీం, అరవింద్, సీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర, ఏబీఎంఎస్ రాష్ట్ర నాయకురాలు భవానీ, తెలంగాణ సాహితీ, టీపీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, పీడీఎం రాజు, పీకేఎం జాన్, కోటి, జనార్దన్, నారాయణరావు, టీటీవీ నేత సందీప్ పాల్గొన్నారు.
