Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడే రాష్ట్ర అవతరణ దినోత్సవం

నేడే రాష్ట్ర అవతరణ దినోత్సవం

అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకరకంగా ఇది తొలి అవతరణ దినోత్సవం కింద లెక్క. అంతకు ముందే ఐదేళ్లపాటు నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. రాష్ట్రాన్ని ఇష్టం లేకుండా విభజించారని…ఆ కసిని గుర్తు పెట్టుకుని, కష్టించి ముందుకెళ్లేందుకు ‘నవనిర్మాణ దీక్ష’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. అవి రాష్ట్రం ఏర్పడిన జూన్‌ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన నవంబరు1నే నవ్యాంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హాజర వుతారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారు. పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, ఆచార్య ఎన్‌జీ రంగా, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం తదితరుల కుటుంబ సభ్యులను ఆహ్వానించారు.

జాతీయ పతాకావిష్కరణ జరిగేనా?
సాధారణంగా రాష్ట్ర అవతరణ, స్వాతంత్య్ర దినోత్సవం లాంటి కార్యక్రమాలు ఉదయమే నిర్వహిస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇప్పుడు సభా సమయాన్ని సాయంత్రం పెట్టడం వల్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం లేకుండా పోయింది. జాతీయ పతాకాన్ని సాయంత్రం ఆరు గంటలకు అవనతం చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రావడమే 5.55కు వస్తారని రాష్ట్ర సమాచార శాఖ పేర్కొంది. అంటే ఇక దాదాపుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరగదు. ఒకవేళ చేసినా మళ్లీ వెంటనే అవనతం చేసేయాల్సిందే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *