Breaking News
Home / Film News / నేడు కార్తీ తాజా చిత్రం ట్రైలర్ విడుదల…

నేడు కార్తీ తాజా చిత్రం ట్రైలర్ విడుదల…

కోడంబాక్కం: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైది’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. దీపావళికి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు కొన్నిరోజుల క్రితమే ప్రకటించాయి. అయితే దీపావళికి విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కార్తి చిత్రం వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే సినిమాను తప్పకుండా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు మళ్లీ అధికారికంగా ప్రకటించాయి. మరోవైపు దీపావళికి విజయ్‌ సేతుపతి నటించిన ‘సంగ తమిళన్‌’ కూడా విడుదలవుతోంది. మొత్తానికి దీపావళి రేసును చూసి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తేల్చి చెబుతోంది ఖైదీ బృందం. ఈ నేపథ్యంలో డ్రీమ్‌ వారియర్‌ ఫిక్చర్స్‌ బ్యానరుపై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌, పాటలను సోమవారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు మాత్రమే ఎంచుకుని నటిస్తున్నారు కార్తి. ఈ సినిమాలో కూడా ఆయన ఖైదీగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *