Breaking News
Home / Lifestyle / Astrology / నేడు సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణ మహా యజ్ఞం

నేడు సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణ మహా యజ్ఞం

అవధూత దత్త పీఠాధిపతి, జగద్గురు, పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య సన్నిధిలో విశ్వశాంతి,
లోక కళ్యాణాలను కాంక్షిస్తూ.. దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే దివ్యసంకల్పంతో సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణ మహా యజ్ఞం

హనుమంతుడు.. ఈ దేవతామూర్తిని గురించి వినని, తెలియని, హిందువు ఉండడు. అంతటి ప్రభావశీలి, ప్రతిభావంతుడు, పిల్లల
దేవుడు, సేవకు, సేవకుడికి నిదర్శనంగా, అనుసరణీయంగా, ఉదాహరణగా నిలిచిన మహోన్నత శక్తి స్వరూపం ఆంజనేయుడు.
సంకట మోచన హనుమాన్‌, కార్యసిద్ది ఆంజనేయస్వామి, బజరంగబలి, రామదూత, అంజనీ సుతుడు, పవనపుత్రుడు, ఇత్యాది పేర్లతో ప్రాచుర్యం పొందిన ఈ ఆంజనేయ స్వామిని తలచినంతనే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు మన దరి చేరవని ప్రశస్తి. మానవులు తరించటానికి, సంసార సాగరాన్ని సులభంగా దాటి ఇహపర సౌఖ్యాలు పొందటానికి, ముక్తిని, మోక్షాన్ని పొంది ఆ పరమాత్మలో ఐక్యం కావటానికి, కొన్ని శతాబ్దాల క్రితం, తులసి దాస్‌ అనే సాధుపుంగవుడు మానవజాతికి వ్రజ భాషలో అందించిన అతి శక్తివంతమైన పారాయణ మంత్రం. శ్రీహనుమాన్‌ చాలీసా ఎంతో మంది మేధావులు, దివ్య పురుషులు, సాధు సంతులు ఈ హనుమాన్‌ చాలీసాని తమ తమ మాతృభాషలలోకి అనువదించి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ కలియుగంలో జనులను సులభంగా భక్తి మార్గంలో ప్రవేశపెట్టుటకు ఆంజనేయోపాసనే సర్వ శ్రేష్ఠమైనది అని తలచి అపర దత్తాత్రేయ స్వరూపులైన పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఒక బృహత్సంకల్పం చేసి దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే దివ్య సంకల్పంతో లక్షలాది మంది భక్తులతో 19-10-19 శినవారం సాయంత్రం 5-100 గంటలకు మన హైదరాబాద్‌ నగరం నడి బొడ్డున గల ప్రఖ్యాత ఎన్టీఆర్‌ స్టేడియం నందు సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణ విశ్వ శాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నాను. సామూహిక పారాయణం అనంత ఫలదాయకం కనుక ఆనాడు పూజ్యషీ స్వామీజీ వారి అమృత గళం నుంచి జాలువారే తులసిదాస విరచితమైన శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణలో, పూజ్య శ్రీ స్వామీజీ వారి అమృత గళంతో మనం కూడా గళం కలిపి స్తుతించి, ప్రార్థించి, విశ్వశాంతికై వారు సంకల్పించిన యజ్ఞంలో మనమూ సమిధలవుదాం – జన్మ సార్ధక్యం చేసుకుందాం. 19-10-19 శనివారం ఉదయం 5-100 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం, ఇందిరా పార్క్‌ దగ్గర, లోయర్‌ ట్యాండ్‌బండ్‌, హైదరాబాద్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలిరండి – హనుమాత్క్రుపకు, సద్గురు అనుగ్రహానికి పాత్రులు కండి. పారాయణలో పాల్గొన్న ప్రతి భక్తునికి శ్రీ స్వామీజీ వారు అనుగ్రహించి శ్రీ హనుమద్రక్ష, హనుమంతునికి అర్చన చేసిన తమలపాకు ప్రసాదం, హనుమధ్వజం, మహా ప్రసాద అందజేయబడతాయి.

వేదిక : ఎస్టీఆర్‌ స్టేడియం, ఇందిరా పార్క్‌ దగ్గర, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌
తేదీ : 19-10-19, శనివారం సాయంత్రం 5-00 గంటలకు

మరిన్ని వివరాలకు : శ్రీ గణపతి సచ్చిదానం ఆశ్రమము, దుండిగల్‌ ఫోన్‌ 040-29701234
శ్రీ దత్త హ్యూమేన్‌ సర్వీసెస్‌, సేవాదళ్‌, సికింద్రాబాద్‌ సెల్‌ : 9392008644, 404-278400287ను సంప్రదించగలరు.

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *