Breaking News
Home / Film News / నేడే విజయ్ మూవీ ట్రైలర్ రిలీజ్….

నేడే విజయ్ మూవీ ట్రైలర్ రిలీజ్….

ఫిల్మ్ న్యూస్: హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ని ఈ రోజు సాయంత్రం 6.02ని.లకి మహేష్ బాబు విడుదల చేయనున్నారు. మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అవుతుందనే సరికి ప్రేక్షకులు చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *