Breaking News
Home / States / నేడు తెలంగాణ కేబినెట్ లో చర్చించే అంశాలివే..?

నేడు తెలంగాణ కేబినెట్ లో చర్చించే అంశాలివే..?

తెలంగాణలో మే 29 వరకూ లాక్‌డౌన్ 3 ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విదితమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏవిధంగా ఉంటుందని నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశం అత్యంత కీలకం కానుంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గిపోవడం, హైదరాబాద్‌లో కూడా నాలుగు చోట్ల మాత్రమే కరోనా కేసులు ఉండటంతో… ప్రభుత్వం మినహాయింపులు ఇస్తుందేమో, లాక్‌డౌన్ సడలిస్తుందేమో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రవాణా అంశంపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వడంతో… బస్సులు నడపాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. ఐతే… సీఎం కేసీఆర్ అప్పుడే నిబంధనలు సడలించకూడదు అనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఇవాళ్టి మీటింగ్‌లో వ్యవసాయ రంగాన్ని మరింత బలంగా చేయడం, అలాగే సాగునీటి అంశాలపైనా చర్చ జరగనుంది. రైతులు ఏ పంటలు పండించాలి, అందుకు ఎలాంటి కార్యాచరణ ఉండాలో కేసీఆర్ చర్చిస్తారు. ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 203 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పోతిరెడ్డిపాడు వ్యవహారంపై జోరు పెంచుతున్న తరుణంలో ఆ అంశంపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడం… కృష్ణా నదీజలాల బోర్డును సంప్రదించడం వంటి అంశాలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో సాయంత్రం వరకు వేచి చూడాలి..

Check Also

ఏపీలో కొత్తగా 33 కరోనా‌ కేసులు…

Share this on WhatsAppఅమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *