Breaking News
Home / hyderabad / టమాటా ప్రస్తుతం కారుచౌకగా

టమాటా ప్రస్తుతం కారుచౌకగా

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా ఉల్లితో సమానంగా ధర పలికిన టమాటా ప్రస్తుతం కారుచౌకగా లభిస్తోంది. మార్కెట్‌లోకి భారీయెత్తున టమాటా సరఫరా పెరిగింది. వారం పదిరోజుల క్రితం వరకూ కిలో టమాటా 50 నుంచి 60 రూపాయల వరకు పలికింది. కానీ ప్రస్తుతం వ్యవసాయమార్కెట్‌లు, రైతుబజార్లలో కిలో టమాటా 15 నుంచి 20 రూపాయలు పలుకుతోంది. గత నెల రోజుల క్రితం భారీ వర్షాల కారణంగానే చాలా జిల్లాల్లో టమాటా పంట దెబ్బతిన్నది. తిరిగి రైతులు టమాటా పంట వేయడంతో తాజాగా ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుతున్నాయి. తెలంగాణలోని మెదక్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డిజిల్లాల పరిధిలో పెద్దయెత్తున టమాటా ఉత్పత్తి జరిగినట్టు వ్యాపారులు తెలిపారు. నగరంలోని గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి, ఎల్‌బినగర్‌, సబ్జీమండి, సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లతో పాటు, మెహదీపట్నం, సరూర్‌నగర్‌, ఎల్‌బి నగర్‌, ఫలక్‌నుమా, కూకట్‌పల్లి, ఆల్వాల్‌ తదితర ప్రాంతాల్లోని రైతుబజార్లకు టమాటా దిగుమతి బాగా పెరిగింది. రోజుకు 150 నుంచి 200 లారీల టమాటా మార్కెట్‌ను ముంచెత్తుతోందని వ్యాపారులు తెలిపారు. కేవలం తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా కర్నాటక, ఏపీ రాష్ట్రాల నుంచి కూడా భారీగా టమాటా దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *