Breaking News
Home / Lifestyle / Health & Fitness / టమాటాల నిజాలు… తెలుసుకుంటే ఆశ్చర్యమే

టమాటాల నిజాలు… తెలుసుకుంటే ఆశ్చర్యమే

సూపర్ ఫుడ్ అనేది ఈ రోజుల్లో కొన్ని ఆహార పదార్థాలకు పెట్టిన పేరు. ఈ జాబితాలో టమాట కూడా ఉంది. ఎందుకంటే దీనితో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలే. టమాటాలు కాన్సర్ రాకుండా అడ్డుకోవడమే కాదు… స్కిన్‌ని కాపాడుతున్నాయి. అధిక బరువు తగ్గిస్తున్నాయి. గుండెకు మేలు చేస్తున్నాయి. మీకు తెలుసా… 200 ఏళ్ల కిందట అమెరికాలో ఇవే టమాటాలను విషపూరితమైనవిగా భావించేవారు. ఎందుకో తెలుసా… ఈ టమాటా మొక్కలు… నైట్ షేడ్ అనే విషపుమొక్కల (toxic nightshade) జాతికి చెందినవి కావడమే. అలాంటి టమాటాలు ఇప్పుడు ప్రపంచంలో దుంపలు, లెట్యూస్, ఉల్లిపాయలు తర్వాత ఎక్కువగా వాడుతున్న పండ్లు. అందుకే టమాటాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

టమాటాలు తింటే కాన్సర్ నుంచి రక్షణ లభించడమే కాదు… బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా టమాటాలు చేస్తాయి. టమాటాల్లోని కారొటేనాయిడ్స్… కంటిని కాపాడతాయి. రేచీకటి రాకుండా చేస్తాయి. టమాటాలు ఎంత ఎక్కువగా తింటే… శరీరానికి అంతలా రకరకాల పోషకాలు లభిస్తాయి. టమాటాల్ని పండించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో క్రిమిసంహారకాలు, కెమికల్స్, పురుగు మందులు వాడుతున్నారు. అందువల్ల టమాటాల్ని వాడే ముందు బాగా కడగాలి.

మలబద్ధకం నివారణకు టమాటాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే టమాటాల్లో ఫైబర్, నీరు ఎక్కువ. అవి మూత్రాశయం బాగా పనిచేసేలా చేస్తాయి. గర్భిణీలు టమాటాలు వాడటం మేలు. గర్భంలో పసికందు, ఆహార నాళం చక్కగా పనిచేసేందుకు టమాటాల్లోని పోషకాలు ఉపయోగపడతాయి. టమాటాల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ C, విటమిన్ A ఉంటాయి. అందువల్ల టమాటాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. టమాటాల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే… వాటిలో రుచి పోతుంది. బయట ఉంచి వండుకోవడమే మంచిది. టమాటాల్ని మొదట చూసింది దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత సానువుల్లో. ఇప్పుడు అక్కడ పెరు దేశం ఉంది. అజ్‌టెక్ జాతుల ప్రజలు టమాటాల్ని బాగా తినేవాళ్లు.

టమాటాల్ని కూరగాయ కింద భావించరు. ఎందుకంటే… టమాటాలు పూల నుంచి వస్తాయి. పైగా టమాటాల్లో గింజలు ఉంటాయి. పూల మొక్క నుంచి రావడం వల్ల వాటిని పండ్లుగా భావిస్తారు. 1887లో కూరగాయలపై అమెరికా పన్నులు వేసేది. టమాటాలపై వేసేది కాదు. కారణం అవి పండ్లు కాబట్టి. చల్లటి వాతావరణ ప్రదేశాల్లో టమాటాల్ని గ్లాస్ హౌసెస్‌ (greenhouses)లో పెంచుతారు.

టమాటాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది చైనా. ప్రపంచంలో 25 శాతం టమాటాలు అక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఆ తర్వాత అమెరికా, ఇండియా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. టమాటాలు ఎరుపు రంగుతోపాటు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లాక్, బ్రౌన్, వైట్, పర్పుల్ కలర్‌లో కూడా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా టమాటాల్లో 7500 రకాలున్నాయి. స్పెయిన్‌లో ఏటా టమాటాల ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో దాదాపు లక్షన్నర మంది పాల్గొంటారు.

ప్రపంచంలో ఓ టమాటా మొక్క గిన్నిస్ బుక్ రికార్డ్‌లకు ఎక్కింది. దానికి ఏడాది కాలంలో 32194 టమాటాలు కాశాయి. (2005 మే నుంచీ 2006 ఏప్రిల్ మధ్య) అమెరికా… ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో ఆ టమాటా మొక్క ఉండేది. ప్రపంచంలో అతి పెద్ద టమాటా… అమెరికాలోని ఒక్లహోమాలో… 1986లో కాసింది. దాని బరువెంతో తెలుసా… 3.51 కేజీలు. అది కూడా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.

Check Also

వ్యవసాయ రంగంపై మూడు కీలక నిర్ణయాలు…

Share this on WhatsAppన్యూఢిల్లీ: రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వన్ నేషన్ వన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *