లండన్: టమాటాలు తింటే పురుషుల్లో వీర్య కణాల నాణ్యత పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. టమాటాల్లో సమృద్ధిగా ఉండే ‘లాక్టోలైకోపీన్’ వీర్యం నాణ్యత పెరగడంలో తోడ్పడుతుందని ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. లాక్టోలైకోపీన్ వీర్యకణాల చలనశీలతను 40 పెంచిందని వివరించారు. టమాటాలను ఎక్కువగా తినడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయని చెప్పారు. 19-30 సంవత్సరాల వయస్సున్న కొంత మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. సాంపిల్ పరిమాణం చిన్నదైనప్పటికీ తమ పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.
