Breaking News
Home / States / Telangana / శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న ఓట్ల పండుగ….

శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న ఓట్ల పండుగ….

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. నవంబర్ 19వ తేదీన ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా గురువారం ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే ఈ తొలి షెడ్యూల్‌ పూర్తైన తర్వాత రాజమౌళి మరో కీలక బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. అంతేకాక.. తనతో పాటు ఎవరు వస్తారంటూ.. అయన అభిమానుల్ని ప్రశ్నించారు.

కీలక బాధ్యత ఏంటా? అని ఖంగారు పడకండి. ఆ బాధ్యత మరేదో కాదు.. ఓటు హక్కును వినియోగించుకోవడమే. తెలంగాణలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. కొంతకాలంగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న ఓట్ల పండుగ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్తున్నానని రాజమౌళి ట్వీట్ చేశారు. ‘‘ఆర్‌ఆర్ఆర్ తొలి షెడ్యూల్ పూర్తైంది. ఇప్పుడు నేను ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వెళ్తున్నాను. మరి ఓటు వేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..? ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మన భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ గౌరవాన్ని స్వీకరిద్దాం. రేపు కచ్చితంగా ఓటు వేయండి’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. రాజమౌళితో పాటు పలువురు దర్శకులు, నటీనటులు కూడా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్వీట్లు చేశారు.

Check Also

ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Share this on WhatsAppనల్గొండ: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *