ఫిల్మ్ న్యూస్: ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక నిశ్చితార్థం సీహెచ్ మహేశ్తో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, బాలకృష్ణతోపాటు వెంకటేష్, కృష్ణంరాజు, మురళీ మోహన్, అల్లు అరవింద్, జీవితా రాజశేఖర్, గంటా శ్రీనివాసరావు, పీవీపీ, కేవీపీ, దానం నాగేందర్ వంటి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
