Breaking News
Home / Film News / తన కెరీర్ గురించి మాట్లాడిన టాప్ హీరోయిన్….

తన కెరీర్ గురించి మాట్లాడిన టాప్ హీరోయిన్….

ఫిల్మ్ న్యూస్: తెలుగులో `ముకుంద`, `ఒక లైలా కోసం` వంటి సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించింది పూజా హెగ్డే. తొలి సినిమాలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో నటించే అవకాశం వచ్చింది. ‘మొహంజదారో’ వంటి భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో పూజాను బాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాపైనే దృష్టి పెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సరసన నటిస్తున్న ‘హౌస్‌ఫుల్‌-4’ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా బాలీవుడ్‌లో తన కెరీర్ గురించి పూజా మాట్లాడుతూ “మొహంజదారో విఫలమవడం వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయా?` అని అందరూ అడుగుతుంటారు. ఆ సినిమా చేసినందుకు నాకేం బాధ లేదు. ఆ సినిమా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. హృతిక్ వంటి స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినందుకు ఎప్పటికీ గర్వపడతాను. అయితే సినిమా ఫలితం అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండద`ని చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *