Breaking News
Home / Lifestyle / Business / విక్రయాల్లో నాలుగో స్థానానికి చేరిన టయోటా….

విక్రయాల్లో నాలుగో స్థానానికి చేరిన టయోటా….

ఢిల్లీ: మారుతీ సుజుకీ బాలెనో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్న టయోటా గ్లాన్జా కారు విజయం సాధించడంతో టయోటా మోటార్స్‌ అమ్మకాలు మెరుగుపడి కార్ల విక్రయాల్లో నాలుగో స్థానానికి చేరింది. టాటామోటార్స్‌, హోండాలను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని దక్కించుకొంది. గ్లాన్జా మోడల్‌ విక్రయాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ స్థానం సాధించినట్లు టయోటా పేర్కొంది. నెలకు 2,000 గ్లాన్జాలు విక్రయిస్తున్నట్లు తెలిపింది. మరోపక్క ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్‌లు నిలకడగా రాణిస్తుండటం కూడా టయోటాకు కలిసొచ్చింది.

టయోటా 23 బేసిస్‌ పాయింట్లు ఎగబాకి 4.86శాతం మార్కెట్‌ షేర్‌ను కైవసం చేసుకొంది. గత ఏడాది ఇదే సమయంలో టయోటా భారత మార్కెట్లో 4.63శాతం దక్కించుకొంది. మార్కెట్‌ నెమ్మదించడం లాంటి ప్రభావాలు టాటా, హోండాలపై గణనీయంగా పడ్డాయి. గత ఏడాది 6.21శాతం ఉన్న టాటా మార్కెట్‌ వాటా 4.75 శాతానికి తగ్గింది. ఇక హోండా వాటా 5.49 శాతం నుంచి 4.60శాతానికి పడిపోయింది. టయోటా-సుజీకీల భాగస్వామ్యంలో వచ్చిన తొలికారు గ్లాన్జానే. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లో ఈ కారు టయోటాకు బలాన్నిచ్చింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *