Breaking News
Home / States / జగిత్యాల జిల్లాలో విషాదం…

జగిత్యాల జిల్లాలో విషాదం…

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంధ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *